EasyShare తుది-వినియోగదారు లైసెన్స్ మరియు సేవా ఒప్పందం
ఈ EasyShare తుది వినియోగదారు లైసెన్స్ మరియు సేవా ఒప్పందం (ఇప్పటి నుండి ఈ "ఒప్పందం" అని సూచించబడుతుంది) అనేది EasyShare (ఇప్పటి నుండి "అప్లికేషన్" అని సూచించబడుతుంది) యొక్క సేవ మరియు సంబంధిత టెక్నాలజీ మరియు ఫంక్షన్లకు (ఇప్పటి నుండి ఉమ్మడిగా "సేవ" అని సూచించబడుతుంది) మీ మరియు iQOO మధ్య ఒప్పందం. దయచేసి, ఈ ఒప్పందంలోని ముఖ్యంగా iQOO బాధ్యత మినహాయింపు లేదా పరిమితి, వినియోగదారు హక్కుల పరిమితి, వివాద పరిష్కారం మరియు వర్తించే చట్టాలు అలాగే బోల్డ్ ఫార్మాట్లో గుర్తించబడిన కంటెంట్‌కు సంబంధించి అన్ని నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా చదివి, పూర్తిగా అర్థం చేసుకోండి. మీరు ఈ సేవను పూర్తిగా లేదా కొంతభాగం ఉపయోగించడం కొనసాగిస్తే, ఈ ఒప్పందంలోని అన్ని నిబంధనలను మీరు ఆమోదించినట్టుగా మరియు iQOOతో మీరు ఒక బాధ్యతాయుత ఒప్పందంలోకి ప్రవేశించినట్టు భావించబడుతుంది. మీరు ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే, మీరు సేవను ఉపయోగించలేరు.
ఇక్కడ పేర్కొన్న "మేము" లేదా "iQOO" అంటే, vivo Mobile Communication Co., Ltd. అని అర్థం. ఇది No.1 vivo Road, Chang’an, Dongguan, Guangdong Province, Chinaలో ఉంది, దీని యూనిఫామ్ సోషల్ క్రెడిట్ కోడ్ 91441900557262083U. మార్కెట్ సూపర్విజన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డోంగ్గువాన్ మునిసిపాలిటీలో ఇది రిజిస్టర్ చేయబడింది.
1.1 మీరు సేవను ఉపయోగించినప్పుడు లేదా ఈ ఒప్పందానికి ఆమోదించినప్పుడు మీ ప్రాంతంలోని చట్టాల ప్రకారం, పౌర ప్రవర్తనకు మీకు పూర్తి సామర్థ్యం ఉందని మీరు సూచిస్తున్నారు మరియు హామీ ఇస్తున్నారు.
1.2 మీరు మైనర్ అయితే లేదా మీ ప్రాంతంలోని చట్టం ప్రకారం పౌర ప్రవర్తనకు మీకు పూర్తి సామర్థ్యం లేని పక్షంలో మీ తల్లిదండ్రుల లేదా సంరక్షకుల నుండి సమ్మతి లేదా నిర్ధారణ లేకుండా మీరు సేవను ఉపయోగించకూడదు లేదా ఈ ఒప్పందం ఆమోదించకూడదు.
1.3 మీరు ఈ సేవను వినియోగిస్తే లేదా ఈ ఒప్పందం ఆమోదిస్తే ఈ విభాగంలోని మొదటి పేరాలో ఉన్న కేటాయింపునకు మీరు అనుకూలంగా ఉన్నారని లేదా మీ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుండి మీరు సమ్మతి స్వీకరించారని భావించబడుతుంది.
2.1 ఈ సేవ అనేది పరికరాల మధ్య ఫైల్లు బదిలీ చేసే సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది. ప్రధాన విధులు కింది విధంగా ఉంటాయి:
2.1.1 వ్యక్తిగత సమాచారం సెట్టింగ్‌లు: మీరు ఈ సేవను ఉపయోగించే సమయంలో మీ సొంత మారుపేరు మరియు అవతార్‌ను సెట్ చేసుకోవచ్చు.
2.1.2 ఫోన్ క్లోన్: అప్లికేషన్లు, సంగీతం, వీడియో, ఆడియో మొదలైన డేటాను ఒకదాని నుండి మరొక దానికి మరియు ముఖాముఖి పంపడానికి లేదా స్వీకరించడానికి మరొక మొబైల్ పరికరంతో కనెక్షన్ స్థాపించడానికి మీరు ఈ సేవను ఉపయోగించవచ్చు.
2.1.3 డేటా బ్యాకప్: మీ ఫోన్ నుండి మీ కంప్యూటర్‌కి అప్లికేషన్లు, సంగీతం మరియు వీడియోలు వంటి డేటాను బ్యాకప్ చేయడానికి లేదా మీ కంప్యూటర్లో సేవ్ చేసిన బ్యాకప్ డేటాను మీ ఫోన్లోకి పునరుద్ధరించడానికి మీ కంప్యూటర్ పరికరంతో కనెక్షన్ స్థాపించడానికి మీరు ఈ సేవను ఉపయోగించవచ్చు.
2.1.4 ఫైల్ బదిలీ: చిత్రాలు, సంగీతం, వీడియో, ఆడియో మరియు ఫైల్ మేనేజ్‌మెంట్‌లోకి యాక్సెస్ చేయగల ఏవైనా ఇతర కంటెంట్లు (సమిష్టిగా, "కంటెంట్లు")ను ఇతర పక్షానికి ముఖాముఖికి పంపించడం/ స్వీకరించడం కోసం మీరు ఈ సేవ ద్వారా మీ పరికరం మరియు మరొక మొబైల్ పరికరం మధ్య కనెక్షన్ ఏర్పాటు చేయవచ్చు.
2.2 ఇతరాలు
2.2.1 సిస్టమ్ సంస్కరణ మరియు పరికరం మోడల్ మీద ఆధారపడి ఈ సేవ ద్వారా మద్దతు ఇవ్వబడే నిర్దిష్ట ఫంక్షన్లు మారవచ్చు, దయచేసి వాస్తవ లభ్యతను పరిశీలించండి.
2.2.2 మీరు వీటిని అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు: ప్రభావవంతమైన సేవలు మీకు అందించడానికి, మీ టెర్మినల్ ప్రాసెసర్లు, బ్రాడ్‌బ్యాండ్ మరియు ఇతర వనరులను ఈ సేవ ఉపయోగించవచ్చు. ఈ సేవను ఉపయోగంలో సంభవించే డేటా ప్రసరణ ఖర్చు కోసం, మీరు ఆపరేటర్ నుండి సంబంధిత రుసుమును తెలుసుకోవాలి మరియు మీరే స్వయంగా సంబంధిత ఖర్చులను భరించాలి.
2.2.3 వినియోగదారు అనుభవం మరియు సేవా కంటెంట్‌ను మెరుగుపరచడానికి, iQOO కొత్త సేవలను అభివృద్ధి చేయడానికి మరియు సమయానుకూలంగా అప్డేట్ సేవను అందించడానికి కృషి చేస్తుంది (ఈ అప్డేట్లు ఒకటి లేదా మరిన్ని రూపాల్లో ఉండవచ్చు, ఉదాహరణకు ఫంక్షన్ భర్తీ చేయడం, సవరించడం, శక్తివంతం చేయడం, సంస్కరణ అప్‌గ్రేడ్, కంటెంట్ సర్దుబాటు మరియు మొదలైనవి). సేవ యొక్క భద్రత కొనసాగింపు మరియు ఫంక్షన్‌ను నిర్ధారించడానికి, iQOO మీకు ప్రత్యేక నోటీసులను ఇవ్వకుండా సేవను అప్డేట్ లేదా సర్దుబాటు చేసే లేదా సేవ యొక్క ఫంక్షన్ మొత్తం లేదా భాగాన్ని మార్చే లేదా పరిమితం చేసే హక్కును కలిగి ఉంది.
3.1 ఈ సేవను ఉపయోగించడానికి iQOO ఇక్కడ మీకు ఒక ప్రత్యేకం కాని, బదిలీ చేయలేని, సబ్‌లైసెన్స్ ఇవ్వలేని, ఉపసంహరించుకోగల మరియు పరిమిత లైసెన్స్‌ను మంజూరు చేస్తోంది.
3.2 iQOO మీకు మంజూరు చేసే లైసెన్స్ ద్వారా, iQOO మీకు అందించే ఏదైనా కంటెంట్, ఉత్పత్తి, లేదా సేవను మీరు మొత్తంగా లేదా దానిలో కొంత భాగాన్ని విక్రయించడం మరియు/లేదా బదిలీ చేయడం చేయవచ్చని మీరు భావించకూడదు లేదా అలాంటి నిర్ణయానికి రాకూడదు.
3.3 ఈ ఒప్పందంలోని విభాగం 3.1లో ప్రకారం, ఈ సర్వీస్ కోసం మీకు స్పష్టంగా మంజూరు చేసిన పరిమిత లైసెన్స్‌కు సంబంధించి ఎలాంటి కాపీరైట్, ట్రేడ్‌మార్క్, పేటెంట్ లేదా ఇతర ఎలాంటి మేధోసంపత్తి హక్కు లేదా యాజమాన్య హక్కును iQOO మీకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇవ్వడం లేదు.
3.4 ఈ సేవకు సంబంధించిన ఏవైనా విషయాంశాలను మీరు వాణిజ్యపరంగా ఉపయోగించకూడదు, సవరించకూడదు, విడదీయకూడదు, పునరుత్పత్తి చేయకూడదు లేదా రివర్స్ ఇంజనీర్ చేయకూడదు.
3.5 నిర్మాణాలు, సోర్స్ కోడ్లు, మరియు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన పత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా వాటితోసహా సాఫ్ట్వేర్ మరియు విషయాంశాలన్నీ iQOO, iQOO అనుబంధ సంస్థలు లేదా దాని సరఫరాదారుల ఆస్తులనీ, వీటిలో విలువైన వ్యాపార రహస్యం మరియు/లేదా మేధోసంపత్తి అంశాలు ఉంటాయనీ, మరియు ఇది iQOO, iQOO అనుబంధ సంస్థలు, లేదా దాని సరఫరాదారులకు సంబంధించిన గోప్య సమాచారంగా పరిగణించబడుతుందని నేను గుర్తిస్తున్నాను మరియు ఆమోదిస్తున్నాను.
3.6 సంబంధిత కాపీరైట్ మరియు ఇతర మేధోపరమైన ఆస్తి హక్కుల నియంత్రణలు మరియు/లేదా ఎగుమతి నియంత్రణ నియంత్రణలకు మాత్రమే పరిమితం కాకుండా, వీటితో పాటుగా వర్తించే అన్ని చట్టాలకు అనుగుణంగా మాత్రమే ఈ సేవను ఉపయోగిస్తారని మీరు అంగీకరించాలి.
4.1 మీరు ఈ సేవను ఉపయోగించే సమయంలో, వర్తించే చట్టాలు మరియు నిబంధనలకు మీరు లోబడి ఉంటారని, మరియు ఏదైనా చట్టవిరుద్ధ లేదా ఉల్లంఘన చర్య కోసం ఈ సేవను ఉపయోగించరని, వీటికి మాత్రమే కాకుండా వీటితో పాటు క్రింది వాటికి కూడా కట్టుబడి ఉంటారని మీరు ఇక్కడ అంగీకరిస్తున్నారు:
4.1.1 హోస్ట్ చేయడం, ప్రదర్శించడం, అప్లోడ్ చేయడం, సవరించడం, ప్రచురించడం, ప్రసారం చేయడం, నిల్వ చేయడం, అప్డేట్ చేయడం లేదా భాగస్వామ్యం చేయడం:
4.1.1.1 ఏదైనా చట్టవిరుద్ధ, అపఖ్యాతి, నిందించే, విచక్షణ, ప్రేరేపిత, విప్లవాత్మక, ఆగ్రహ, హింసాత్మక, ద్వేషపూరిత, దుర్భాష, అశ్లీల, జాతిపరంగా లేదా నైతికంగా అభ్యంతకరమైన, లింగం ఆధారంగా నిందించడం లేదా వేధించడం, దేశ భద్రత, సమగ్రత లేదా సౌభ్రాతత్వం లేదా ప్రజలకు ప్రమాదం కలిగించే లేదా ఏదైనా రూపంలో ఇతర చట్టవిరుద్ధ కంటెంట్;
4.1.1.2 పెడోఫిలిక్ సంబంధిత లేదా పిల్లలకు హాని కలిగించే ఏదైనా కంటెంట్;
4.1.1.3 ఏదైనా కంప్యూటర్ వనరు ఫంక్షనాలిటీకి అంతరాయం కలిగించడానికి, నాశనం లేదా పరిమితం చేయడానికి డిజైన్ చేయబడిన సాఫ్ట్వేర్ వైరస్ లేదా ఏదైనా ఇతర కంప్యూటర్ కోడ్, ఫైల్ లేదా ప్రోగ్రామ్ కలిగి ఉండడం;
4.1.2 మోసం, మనీ లాండరింగ్, చట్టవిరుద్ధ లావాదేవీలు, గ్యాంబ్లింగ్ మరియు అటువంటివి లేదా అమలులో ఉన్న చట్టాలతో మరొక విధంగా అననుకూలంగా లేదా విరుద్ధంగా ఉన్నవి;
4.1.3 పేరు (మరొక వ్యక్తి వలె నటించడం వంటివి), ప్రఖ్యాతి, వ్యక్తిగత సమాచారం, గోప్యత మరియు వాణిజ్య రహస్యం, కాపీరైట్, పేటెంట్ హక్కు, ట్రేడ్‌మార్క్, మరియు ఇతరులకు సంబంధించిన ఇతర రకాల యాజమాన్య హక్కులు ఉల్లంఘించడం;
4.1.4 చట్టాన్ని వ్యతిరేకించే మరియు/లేదా ఇతరుల హక్కులు మరియు ఆసక్తులను ఉల్లంఘించే ఉద్దేశ్యంతో తప్పుడు లేదా మోసపూరిత సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా కమ్యూనికేట్ చేయడం; మరియు
4.1.5 వర్తించే చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించే, ఇతరుల హక్కులను ఉల్లంఘించే మరియు/లేదా ఏదైనా మార్గంలో మైనర్లకు హాని కలిగించే ఏదైనా ఇతర చర్య.
4.2 పై పేరాగ్రాఫ్‌లో పేర్కొన్న ఏదైనా ఉల్లంఘనకు మీరు పాల్పడితే, iQOO ఏకపక్షంగా మీకు ఈ సేవను నిలిపివేస్తుంది, ఉల్లంఘించే/చట్టబద్ధంకాని అంశాలను తీసివేస్తుంది మరియు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
మేము మీ గోప్యత మరియు వ్యక్తిగత సమాచారానికి ప్రాముఖ్యత ఇస్తాము కనుక మీ సమాచారం యొక్క మా సేకరణ మరియు ప్రాసెసింగ్ మా "గోప్యతా విధానం"కు అనుకూలంగా ఉంటాయి. మీరు ఈ సేవను ఉపయోగించడానికి ముందు, EasyShare గోప్యతా నిబంధనలను పూర్తిగా చదవండి.
6.1 ఈ సేవ అనేది మీ వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే మరియు దీనిని ఏ మూడవ పక్షానికి అందించకూడదు. iQOO అందించే సేవలు, పనితీరు లేదా విధులకు సంబంధించి మీ వినియోగ ఫలితాలకు (అది చట్టవిరుద్ధం లేదా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లాంటి ఏ అంశమైనా కావచ్చు) మీరు మాత్రమే బాధ్యత వహిస్తారని మీరు అర్థం చేసుకున్నారు మరియు అంగీకరిస్తున్నారు. ఈ సేవ ఉపయోగించడం వలన సంభవించే అన్ని ప్రమాదాలకు బాధ్యత వహించేందుకు మీరు అంగీకరిస్తున్నారు.
6.2 పైన పేర్కొన్న అంశాల్లో దేనికీ విరుద్దంగా లేని పక్షంలో, అప్లికేషన్‌కు మాత్రమే పరిమితం కాకుండా దానితో సహా, ఈ సేవ, మరియు ఈ సేవతో సంబంధం కలిగిన మొత్తం సమాచారం, ఉత్పత్తులు, సాఫ్ట్వేర్, ప్రోగ్రామ్‌లు, మరియు విషయాంశాలకు సంబంధించి ఏ రూపంలోనూ లేదా ఏ రకంగానూ హామీలు ఇవ్వకుండా "ఉన్నవి ఉన్నట్లుగా" అనే ప్రాతిపదిక అందించబడుతాయి. చట్టం ద్వారా గరిష్టంగా అనుమతించిన మేరకు భద్రత, స్థిరత్వం, ఖచ్చితత్వం, క్రయవిక్రయాలు, నిర్దిష్ట ప్రయోజన సామర్ద్యం మరియు యాజమాన్యం మరియు మేధోసంపత్తి ఆస్తి ఉల్లంఘన జరగదనే ప్రాతినిధ్యాలు మరియు వారెంటీలకు మాత్రమే పరిమితం కాకుండా వాటితో సహా ప్రత్యక్ష, పరోక్ష చట్టపరమైన మరియు ఇతర రూపాల్లోని అన్ని ప్రాతినిధ్యాలు మరియు వారెంటీలను భరించడానికి iQOO నిరాకరిస్తుంది.
6.3 ఈ విధంగా iQOO నిరాకరిస్తుంది కాబట్టి, ఈ అప్లికేషన్ నుండి లేదా దానికి సంబంధించిన లేదా సంబంధిత కంటెంట్ల కారణంగా మీకు సంభవించే ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, సందర్భోచిత, ప్రత్యేక లేదా ఇతర నష్టాల నుండి చట్టం గరిష్టంగా అనుమతించే మేరకు iQOO, దాని అనుబంధ సంస్థలు మరియు ఉద్యోగులు, డైరెక్టర్లు మరియు iQOO అధికారులకు మీరు మార్పుచేయడానికి సాధ్యం కాని విధంగా, నిరంతరాయంగా, మరియు బేషరత్తుగా విముక్తి ప్రసాదిస్తున్నారు.
6.4 సేవ అందించడంలో లేదా ఈ ఒప్పందంలోని బాధ్యతలు నిర్వహించడంలో వైఫల్యానికి iQOO బాధ్యత వహించదు. దీనికి క్రింది అంశాలు కారణం కావచ్చు:
6.4.1 భూకంపం, వరద, తుఫాను, సునామీ, అంటువ్యాధి, యుద్ధం, తీవ్రవాదుల దాడి, దొమ్మీ, సమ్మె మరియు ప్రభుత్వ ఆదేశం వంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా వాటితోసహా అనివార్య పరిస్థితి;
6.4.2 మేము లేదా మా తరఫున మూడవ పక్షం ద్వారా నిర్వహించబడే సాఫ్ట్వేర్ మరమ్మతు, అప్డేట్ లేదా హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్;
6.4.3 అంతరాయం నెట్వర్క్ ఆపరేటర్ సమస్య లేదా యూజర్ నెట్వర్క్ కనెక్షన్ సమస్య కారణంగా డేటా ప్రసారంలో అంతరాయం;
6.4.4 మూడవ పక్షాలు అందించే సాఫ్ట్వేర్ లేదా సేవల కారణంగా లేదా మూడవ పక్షాలు కారణంగా ఏర్పడే ఏదైనా సమస్య;
6.4.5 iQOO వ్యాపార సర్దుబాటు లాంటి చట్టాలు మరియు నిబంధనలు లేదా ఇతర నిరోధించలేని కారణాల వల్ల iQOO తన సేవను నిలిపివేయడం లేదా ముగించడం.
మీరు నివసిస్తున్న ప్రాంతంలోని చట్టాలకు పూర్తి విరుద్ధంగా పేర్కొని ఉంటే తప్పించి, ఈ ఒప్పందం తప్పక పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చట్టాలకు అనుగుణంగా వర్తించబడుతుంది, ఆ సంబంధిత చట్టాల్లో వైరుధ్యం ఉన్నప్పటికీ, తదనుగుణంగా అన్వయించబడుతుంది. ఈ ఒప్పందం లేదా సేవ నుండి లేదా దానికి సంబంధించి ఏర్పడే ఏవైనా వివాదానికి మంతనాలు ద్వారా పరిష్కరించుకునేందుకు మీరు అంగీకరిస్తున్నారు. మంతనాలు ద్వారా పరిష్కరించడంలో విఫలమయ్యే ఏవైనా వివాదాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చట్టాల ప్రకారం మధ్యవర్తిత్వం కోసం షెంజెన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ (SCIA), పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో సమర్పించాలి. ఈ మధ్యవర్తిత్వం అనేది షెంజెన్ వేదికగా జరుగుతుంది.
మీకు ఏవైనా ఫిర్యాదులు, ప్రశ్నలు, వ్యాఖ్యలు లేదా సూచనలు ఉన్నట్లయితే, మీరు [సహాయం & అభిప్రాయం] ద్వారా మీ ప్రశ్నలను సమర్పించవచ్చు.
9.1 ఈ ఒప్పందం అనేది మీకు మరియు iQOOకి మధ్య కుదిరిన మొత్తం ఒప్పందాన్ని నిర్వహిస్తుంది. అలాగే, ఈ ప్రధాన విషయానికి సంబంధించి మీకు మరియు iQOOకి మధ్య గతంలో కుదిరిన అన్ని ఒప్పందాలను ఇది రద్దు చేస్తుంది.
9.2 ఈ ఒప్పందంలోని ఏదైనా భాగం చెల్లని పక్షంలో లేదా అమలు చేయలేని పక్షంలో, మిగిలిన అంశాలన్నీ పూర్తిగా ప్రభావంలో ఉంటాయి.
9.3 ఈ ఒప్పందంలోని ఏదైనా భాగాన్ని అమలు చేయలేని పక్షంలో, అది మీరు లేదా iQOO వదులుకున్న హక్కుగా పరిగణించరాదు.
9.4 iQOO ద్వారా మీకు మంజూరుచేయబడిన హామీలన్నీ ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొన్న వాటికి మాత్రమే పరిమితం చేయబడతాయి. మీకు ప్రత్యేకంగా మంజూరు చేయని ఇతర అన్ని హక్కులూ iQOO సొంతమై ఉంటాయి.
9.5 మీరు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పక్షంలో, నష్టాలకు ఎలాంటి బాధ్యత వహించకుండా, ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని ముగించడానికి మరియు సంబంధిత సేవలు నిలిపివేయడానికి iQOOకి హక్కు ఉంటుంది. సందేహాన్ని తప్పించడం కోసం, ఈ ఒప్పందంలో వ్యక్తీకరించబడిన లేదా అమలు చేయడం కొనసాగడానికి ఉద్దేశింబడిన ఏదైనా నిబంధన అనేది ఒప్పందం చేయబడిన నిబంధనల గడువు ముగిసే వరకు లేదా సహజసిద్ధంగా వాటి గడువు ముగిసేవరకు ఈ ఒప్పందం రద్దు అయ్యే వరకు ఉనికిలో ఉంటుంది.
9.6 సమయానుకూలంగా ఈ ఒప్పందంలో మార్పులు చేసే హక్కు iQOOకి ఉంటుంది. ఒప్పందానికి సంబంధించిన నిబంధనల తాజా సంస్కరణను మీరు సంబంధిత పేజీలో పరిశీలించవచ్చు. మీరు సేవను వినియోగించడం కొనసాగిస్తే, ఈ ఒప్పందంలోని మార్పు చేసిన సంస్కరణను మీరు ఆమోదించినట్లుగా పరిగణించబడుతుంది.
9.7 మీరు సేవను ఉపయోగిస్తూ నివాస స్థానిక అధికారం, రాష్ట్రం, స్వయంపాలిక ప్రాంతం, ఫెడరేషన్ మరియు దేశం యొక్క చట్టాలు, ఆదేశాలు, చట్ట నిబంధనలు మరియు ఇతర నియమాలకు అనుగుణంగా ప్రవర్తించేందుకు ఆమోదిస్తున్నారు.
కాపీరైట్ © 2022-ప్రస్తుతం vivo Mobile Communication Co., Ltd. సర్వహక్కులు ప్రత్యేకించబడ్డాయి
ఆగస్టు 26, 2022న అప్డేట్ చేయబడింది